పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టులు.. యువకుడిని అరెస్ట్ చేసిన పిఠాపురం పోలీసులు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో కూరపాటి రవీంద్రబాబు అనే యువకుడిని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన రవీంద్రబాబుపై గత నెల 13న జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బుధవారం పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సత్యనారాయణ వెల్లడించారు.





