ఏసీబీకి చిక్కిన మెట్‌పల్లి సీడీపీఓ పద్మ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సీడీపీఓ దరోజు పద్మ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మెట్‌పల్లి అర్బన్ మండలంలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ నివేదికల కోసం ఒక్కో కేంద్రానికి నెలకు రూ. 1,000 చొప్పున మూడు నెలలకు మొత్తం రూ. 63,000 లంచం డిమాండ్ చేశారు. శనివారం కార్యాలయ ఆవరణ వెలుపల ఫిర్యాదుదారుడి నుంచి నగదు తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. లంచం సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సీడీపీఓను అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్న కరీంనగర్ ఏసీబీ అధికారులు.
ClickTelugu ని ఫాలో అవ్వండిX



