తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

క్యాష్ ఇస్ కింగ్

ప్రత్యేక కథనంజాతీయం
క్యాష్ ఇస్ కింగ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

యూపీఐ రికార్డులు బద్దలు.. పదేళ్లలో 143 శాతం పెరిగిన కరెన్సీ వాడకం

డిజిటల్ పేమెంట్లతో చిన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు యూపీఐ మయం అయింది. జేబులో పర్సు లేకపోయినా స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు అన్నట్లుగా చెల్లింపులు చేస్తున్నారు. అంతా ఆన్‌లైన్ అవుతున్నా మార్కెట్లో నగదు వాడకం తగ్గకపోగా పదేళ్లలో ఏకంగా 143 శాతం పెరిగింది.

నవంబర్ 8, 2016న పెద్ద నోట్ల రద్దు నాటికి దేశంలో 17.77 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉంది. అక్టోబర్ 23, 2026 నాటికి ఈ విలువ 43.16 లక్షల కోట్లకు చేరింది. నాణేలు కూడా కలిపితే మార్కెట్లో 43.58 లక్షల కోట్ల నగదు తిరుగుతోంది. ఈ పదేళ్ల కాలంలో క్యాష్ వాడకం దాదాపు రెండున్నర రెట్లు పెరిగింది.

మరోవైపు డిజిటల్ లావాదేవీల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అక్టోబర్ నెలలోనే యూపీఐ ద్వారా 31.53 లక్షల కోట్ల విలువైన 2546 కోట్ల లావాదేవీలు జరిగాయి. రోజుకు సగటున 82 కోట్లకు పైగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పటికీ జనాలు నగదును గట్టిగానే దాచుకుంటున్నారు.

అత్యవసర వైద్యం, సర్వర్ డౌన్ సమస్యల కోసం ఇంట్లో క్యాష్ ఉంచుకోవడం తప్పనిసరిగా మారింది. పల్లెల్లో నెట్‌వర్క్ సమస్యలతో పాటు చిరు వ్యాపారులు ఇప్పటికీ నగదుపైనే ఆధారపడుతున్నారు. దీనికి తోడు భారతీయుల్లో ఉన్న పొదుపు అలవాటు కూడా కరెన్సీ వాడకం పెరగడానికి కారణమవుతోంది.

ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువలో 500 రూపాయల నోట్ల వాటా 85.5 శాతంగా ఉంది. యూపీఐతో చెల్లింపులు సులభతరంగా మారుతున్నా భద్రత, పొదుపు కోసం ప్రజలు కరెన్సీ నోట్లనే ఆశ్రయిస్తున్నారు.

సంబంధిత వార్తలు