ఏపీలో పెట్టుబడులకు సిద్ధమన్న జపాన్ రాయబారి కెయిచీ ఓనో

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని భారత్‌లో జపాన్ రాయబారి కెయిచీ ఓనో వెల్లడించారు.
రాష్ట్రంలో జపాన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన కెయిచీ ఓనో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, కీలక ఖనిజాల సరఫరా, గ్రీన్ ఎనర్జీ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.





