సిరిపై ఆకుల శ్రీవాణి వీడియో.. అసలు విషయం ఇదే!
ఐఫోన్ సిరి సమాధానాలపై ఇన్‌ఫ్లుయెన్సర్, పార్టీ అధికార ప్రతినిధి ఆకుల శ్రీవాణి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్..
'రామ్ రామ్', 'జై శ్రీరామ్' అంటే సిరి కేవలం 'హలో' అని బదులిస్తోందని శ్రీవాణి పేర్కొన్న వైనం..
అదే 'అస్సలాము అలైకుమ్' అంటే మాత్రం 'వ అలైకుము అస్-సలామ్' అని సమాధానం ఇస్తోందంటూ ప్రస్తావన..
రాబోయే అప్‌డేట్‌లో సిరి 'జై శ్రీరామ్' అని చెప్పాలని.. లేదంటే మనవాళ్లు చూసుకుంటారంటూ హెచ్చరిక..
ఆకుల శ్రీవాణి గారూ.. సాధారణ గ్రీటింగ్స్, ప్రత్యేక అక్షరాల కోడింగ్ మధ్య తేడాను అర్థం చేసుకోవడం ముఖ్యం అన్నది మా మాట..
వాయిస్ అసిస్టెంట్లు ప్రోగ్రామ్ చేసిన ప్రామాణిక పలకరింపులు, క్యారెక్టర్ ఎన్‌కోడింగ్ డేటా ఆధారంగా మాత్రమే స్పందిస్తాయి..
ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అనవసర రీల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేయడం ప్రధాని మోదీ గారు చెబుతున్న పద్ధతి కాదు..
టెక్నాలజీ వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించడమే అందరికీ శ్రేయస్కరం..
సాంకేతికత పనితీరుపై సరైన అవగాహన, బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరం.





