తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

గక్ ఫ్రూట్ సాగుతో ఏపీ రైతు సక్సెస్.. ఏడాదికి రూ.30 లక్షల ఆదాయం

ప్రత్యేక కథనంజాతీయం
గక్ ఫ్రూట్ సాగుతో ఏపీ రైతు సక్సెస్.. ఏడాదికి రూ.30 లక్షల ఆదాయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ రైతు అరుదైన గక్ ఫ్రూట్ సాగు చేస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. విభిన్నమైన పంటను ఎంచుకుని ఏడాదికి రూ.30 లక్షల ఆదాయం సొంతం చేసుకుంటున్నారు.

కరోనా సమయంలో హైదరాబాద్‌లో తన ఉద్యోగాన్ని వదిలేసిన బి. శేషుబాబు రామిరెడ్డిపల్లిలోని తన సొంత పొలంలో వ్యవసాయం మొదలుపెట్టారు. ముందుగా పావు ఎకరం భూమిలో రూ.700 చొప్పున వంద గక్ మొక్కలను కొనుగోలు చేసి 2023లో సాగు ప్రారంభించారు.

మొదటి కాపులోనే మంచి దిగుబడి రావడంతో ఈ సాగును మరింత విస్తరించారు. ప్రస్తుతం ఐదెకరాల విస్తీర్ణంలో సుమారు 300 గక్ మొక్కలను ఆయన పెంచుతున్నారు. ఈ పండ్లకు మార్కెట్లో డిమాండ్ ఉండటంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కిలో రూ.500 నుంచి రూ.600 వరకు విక్రయిస్తున్నారు.

ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఈ పండ్లను హైదరాబాద్‌లోని మాల్స్‌తో పాటు వినియోగదారులకు నేరుగా సరఫరా చేస్తున్నారు.

లాభదాయకమైన గక్ ఫ్రూట్‌తో పాటు డ్రాగన్ ఫ్రూట్, జామ, బొప్పాయి వంటి ఇతర పంటలను కూడా ఆయన సాగు చేస్తున్నారు. వినూత్న వ్యవసాయం చేస్తూ తోటి రైతులకు శేషుబాబు ఆదర్శంగా నిలబడ్డారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు