తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

సౌదీలో ఉద్రిక్తతలు: భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ సూచన

ప్రత్యేక కథనంజాతీయం
సౌదీలో ఉద్రిక్తతలు: భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ సూచన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సౌదీ అరేబియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని రాయబార కార్యాలయం (Indian Embassy in Saudi Arabia) పేర్కొంది. ఏమైనా వైమానిక దాడులు జరిగితే.. తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. దాడులు జరిగినప్పుడు ఒకవేళ గదిలో ఉంటే కిటికీలకు దూరంగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా అక్కడ జరిగే ఘటనలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు తీయడం, వాటిని ఇతరులతో పంచుకోవడం చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు రియాద్‌లో ఉన్న భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది.

గాయపడిన భారత పౌరులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులను ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు సందర్శిస్తూనే ఉన్నారు. వారి కుటుంబీకులను నిరంతరం సంప్రదిస్తూ అవసరమైన సాయాన్ని అందిస్తున్నారు.

రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం విమాన కార్యకలాపాలు కొనసాగడం లేదు. కొంత అంతరాయం ఉన్నప్పటికీ దమ్మమ్‌, జెడ్డా, మదీనా ఎయిర్‌పోర్టులు మాత్రం కొనసాగుతున్నాయి.

భారత్‌కు చెందిన విమానయాన సంస్థలు సౌదీ అరేబియాకు తాత్కాలికంగా సర్వీసులు నిలిపివేశాయి. అక్టోబర్‌ 24 వరకు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఇండిగో సర్వీసులు నిలిపివేయగా.. ఆకాశ ఎయిర్‌ అక్టోబర్‌ 27 వరకు సర్వీసులు నిలిపివేసింది.

భారత్‌ నుంచి దమ్మామ్‌, జెడ్డా, మదీనాలకు పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడుస్తున్నాయి. భారత్‌ నుంచి అత్యవసరంగా వెళ్లేవారు బహ్రెయిన్‌, కువైట్‌ లేదా ఖతర్‌ మార్గాలను ఎంచుకోవచ్చు.

ఉమ్రాతోపాటు సౌదీకి వెళ్లాలని భావించే భారత పౌరులు అక్కడి ఎయిర్‌పోర్టులో అంతరాయాలు, విమానాల రద్దును దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో భారత కాన్సులేట్‌, ఎంబసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని ఎంబసీ పేర్కొంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు