తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

8 క్లౌడ్ కిచెన్ల లైసెన్సులు సస్పెండ్.. 700 కిలోల కలుషిత ఆహారం ధ్వంసం

ప్రత్యేక కథనంజాతీయం
8 క్లౌడ్ కిచెన్ల లైసెన్సులు సస్పెండ్.. 700 కిలోల కలుషిత ఆహారం ధ్వంసం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్న హోటళ్లు, క్లౌడ్‌ కిచెన్లపై TG SAFE అధికారులు కొరడా ఝళిపించారు. గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌, ఖైరతాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో తీవ్ర ఉల్లంఘనలు వెలుగుచూశాయి. మొత్తం 23 హోటళ్లు, క్లౌడ్‌ కిచెన్లలో తనిఖీలు నిర్వహించగా.. నిబంధనలు పాటించని 8 సంస్థల లైసెన్సులను అధికారులు సస్పెండ్‌ చేశారు. తక్షణమే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు.

24 బృందాలతో తనిఖీలు

నవంబర్‌ 10న నిర్వహించిన ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌లో ఆహార భద్రతా అధికారులు, హైదరాబాద్‌ నగర పోలీసులతో కూడిన 24 బృందాలు పాల్గొన్నాయి. తనిఖీల్లో పాడైన ఆహార పదార్థాలు, గడువు ముగిసిన సరుకులు, బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు, అపరిశుభ్రమైన వంటగదులు గుర్తించారు. శాఖాహార, మాంసాహార పదార్థాలను ఒకే ఫ్రీజర్‌లో నిల్వ చేయడం వంటి ఉల్లంఘనలూ బయటపడ్డాయి.

8 సంస్థలపై చర్యలు

బిర్యానీ బై కిలో (గచ్చిబౌలి), కుల్చా కల్చర్‌ (మాదాపూర్‌), లక్కీ మల్టీ క్యూసిన్‌ రెస్టారెంట్‌ (సోమాజిగూడ), టమ్‌ యమ్‌ ఇన్నోవిజన్స్‌ (మాదాపూర్‌), జోరా 11 బై 2 (ఖైరతాబాద్‌), ఎల్‌ఓ ఫ్రెష్‌ ఫుడ్స్‌ (మాదాపూర్‌), ఐటీసీ ఆశీర్వాద్‌ సోల్‌ క్రియేషన్స్‌ క్లౌడ్‌ కిచెన్‌ (గచ్చిబౌలి), సోడెక్సో ఇండియా సర్వీసెస్‌ (కొండాపూర్‌) సంస్థల్లో తీవ్రమైన లోపాలను గుర్తించి లైసెన్సులు సస్పెండ్‌ చేశారు.

మరో 10 సంస్థలకు నోటీసులు

ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని ప్రిజం హాస్పిటాలిటీ సర్వీసెస్‌, ఘర్‌ ది క్లౌడ్‌ కిచెన్‌, రెబెల్‌ ఫుడ్స్‌ తదితర 10 సంస్థలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మరో ఐదు సంస్థలకు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసులు ఇవ్వనున్నారు.

700 కిలోల ఆహారం ధ్వంసం

తనిఖీల్లో భాగంగా సుమారు 700 కిలోల కుళ్లిన, కలుషిత ఆహార పదార్థాలను అధికారులు ధ్వంసం చేశారు. అనుమానాస్పదంగా ఉన్న 25 ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. వంటగదుల్లో అపరిశుభ్రత, పూడుకుపోయిన డ్రైనేజీలు, జిడ్డుపట్టిన ఎగ్జాస్ట్‌ వ్యవస్థలు, రక్షణ పరికరాలు లేకుండా పనిచేస్తున్న సిబ్బందిని గుర్తించారు.

సంబంధిత వార్తలు