రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడులు నిర్వహించారు. కాంట్రాక్టర్‌కు పెండింగ్ బిల్లులు విడుదల చేసేందుకు రూ.50 వేల లంచం తీసుకుంటుండగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ తెలిపింది.
రూ.2.63 లక్షల బిల్లు విడుదలకు ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో రూ.6.40 లక్షల బిల్లు విడుదలకు అక్టోబర్ 26న రూ.10 వేలు తీసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. నిందితుడి కారు డ్యాష్‌బోర్డు నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చు.





