8 నెలల తర్వాత హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపు.. రూ.4.85 లక్షల ఆదాయం!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ బంజారాహీల్స్ రోడ్ నంబర్ 1లోని శ్రీ హనుమాన్ ఆలయంలో ఎనిమిది నెలల తర్వాత హుండీ కానుకలను లెక్కించారు. ఈ లెక్కింపులో మొత్తం రూ.4,85,760 ఆదాయం సమకూరినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈవో సత్యచంద్రారెడ్డి, ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్ యుగేశ్వర్, ఎక్స్ అఫీషియో సీతారామశర్మ, ఆలయ పాలకమండలి చైర్మన్ దయానంద్ యాదవ్, సభ్యులు గంగ, ప్రవీణ్, రామకృష్ణ, నరేష్, శ్రీకాంత్‌తో పాటు శ్రీవారి సేవా సమితి సేవకులు పాల్గొన్నారు.





