తెలంగాణ విద్యావ్యవస్థలో భారీ మార్పులు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 విధానం!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ విద్యావ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యావిధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని, 9 నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక విద్యాబోధనపై దృష్టి సారించాలని సూచించారు. 12వ తరగతి నుంచి నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా అభివృద్ధి చేయాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంస్కరణలు అమలు చేయాలని స్పష్టం చేశారు.





