తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ జగన్ ఫైర్

రాజకీయంఆంధ్రప్రదేశ్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ జగన్ ఫైర్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను PPP ముసుగులో ప్రైవేటుకు అప్పగించడం భారీ స్కాం అని వైఎస్ జగన్ మండిపడ్డారు.

గతంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని, 5 కాలేజీలను ప్రారంభించామని, 3 కాలేజీలు తరగతులకు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఏడాదికి రూ.1000 కోట్లు కేటాయిస్తే మిగిలిన 9 కాలేజీలు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఈ కాలేజీలను స్థానిక ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్స్‌తో అనుసంధానించి గ్రామస్థాయి వరకు నాణ్యమైన వైద్యం అందించేలా నెట్‌వర్క్‌ను రూపొందించామని తెలిపారు.

వందల కోట్ల విలువైన భూములను ఎకరా రూ.100కే లీజుకు ఇస్తున్నారని, VGF పేరుతో రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు సంస్థలకు అప్పగించి, రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తే ఒక్కో కాలేజీకి రూ.120 కోట్ల భారం పడుతుందని వివరించారు.

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, దూది కూడా లేవని విమర్శించారు. తమ హయాంలో జీరో వేకెన్సీ పాలసీతో స్పెషలిస్టు డాక్టర్ల ఖాళీలను 61% నుండి 4%కి తగ్గించామని గుర్తుచేశారు. కోటి మంది సంతకాలతో నిరసన తెలిపినా ప్రభుత్వం ముందడుగు వేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.

ఈ స్కాంలో భాగస్వాములైన వారిపై భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అరెస్టులకూ వెనుకాడమని జగన్ హెచ్చరించారు.

PPP స్కామ్‌పై జగన్ తీవ్ర ఆరోపణలు.

సంబంధిత వార్తలు