తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

కారు అద్దె గొడవలో దారుణం.. పక్కా స్కెచ్‌తో యువకుడి హత్య

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కార్వేటినగరం:

మధ్యవర్తిత్వం వహించి అద్దెకు కారు ఇప్పించడం ఒకరి ప్రాణం తీసింది. పక్కా ప్లాన్‌తో కారుతో ఢీకొట్టి హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు జరిపిన విచారణలో మర్డర్ మిస్టరీ వీడింది.

కార్వేటినగరం మండలం తురకమిట్టకు చెందిన యుగంధర్‌కు, కేఎం పురానికి చెందిన ప్రదీప్‌ రాజు కుటుంబంతో స్నేహం ఉంది. ఈ చనువుతోనే తెలిసిన వ్యక్తి దగ్గర నుంచి ప్రదీప్‌ రాజుకు యుగంధర్ కారును అద్దెకు ఇప్పించాడు. అయితే అద్దెకు తీసుకున్న ఆ కారును ప్రదీప్‌ రాజు ఫ్యామిలీ ప్రమాదానికి గురిచేసింది. చాలా రోజులు గడిచినా కారును తిరిగి ఇవ్వలేదు. పైగా రూ. 3 లక్షల అద్దె సొమ్మును కూడా చెల్లించకపోవడంతో యుగంధర్ వారిని నిలదీశాడు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వివాదం ముదిరింది. ఈ నెల 9న ప్రదీప్‌ రాజు స్నేహితుడైన లీలా కుమార్‌ను కలిసిన యుగంధర్.. కారు గొడవ గురించి వివరించాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రదీప్‌ కుటుంబం అదే రోజు యుగంధర్‌తో గొడవకు దిగింది. దీంతో స్నేహితుడు ప్రభుదాస్‌తో కలిసి యుగంధర్ పోలీసులను ఆశ్రయించి ప్రదీప్ కుటుంబంపై ఫిర్యాదు చేశాడు. విచారణకు రావాలని పోలీసులు ప్రదీప్‌ రాజుకు ఫోన్ చేయడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ప్రదీప్‌ రాజు కుటుంబం హత్యకు ప్లాన్ చేసింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి స్నేహితుడు ప్రభుదాసుతో కలిసి బైక్‌పై తిరిగి వస్తున్న యుగంధర్ కోసం కాపు కాశారు. కారుతో వేగంగా ఢీకొట్టి పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చారు. దీన్ని కేవలం రోడ్డు ప్రమాదంగానే చిత్రీకరించి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

అయితే యుగంధర్ మృతిపై స్థానికులు, పోలీసులకు పలు అనుమానాలు వచ్చాయి. లోతుగా విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. యుగంధర్‌ను హతమార్చేందుకే కారుతో ఢీకొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రదీప్‌ రాజు, అతని సోదరుడు దిలీప్‌ రాజు, స్నేహితుడు లీలా కుమార్, తల్లి విజయలక్ష్మిలను అరెస్టు చేశారు. నిందితుడిగా ఉన్న రవికుమార్ రాజు అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు